Telugu Global
Telangana

రేవంత్‌ సర్కార్‌కు హైకోర్టు షాక్‌

ఇప్పుడు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించడం లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు చేయాలని సీబీఐకి లేఖ రాయడం తప్ప మరో మార్గం లేదు.

రేవంత్‌ సర్కార్‌కు హైకోర్టు షాక్‌
X

రేవంత్‌ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయని రేవంత్ సర్కార్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జ‌రిపిస్తామని సీఎం రేవంత్ పలుమార్లు చెప్పారు. ఈ మేరకు జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు లేఖ సైతం రాశారు. అయితే రేవంత్ ప్రతిపాదనను హైకోర్టు తిరస్కరించిందని సంబంధింత వర్గాలు తెలిపాయి.

దీంతో ఇప్పుడు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించడం లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు చేయాలని సీబీఐకి లేఖ రాయడం తప్ప మరో మార్గం లేదు.

కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటంతో న్యాయ విచారణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిట్టింగ్ జడ్జిని కేటాయించరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించే రేవంత్ సర్కార్ విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

First Published:  7 Feb 2024 5:33 AM GMT
Next Story