Telugu Global
Telangana

భద్రాద్రి రామయ్యకు ఆదిపురుష్ విరాళం..

ప్రభాస్ పంపించిన 10లక్షల రూపాయల విరాళాన్ని.. అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాలకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.

భద్రాద్రి రామయ్యకు ఆదిపురుష్ విరాళం..
X

ఆది పురుష్ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న హీరో ప్రభాస్ భద్రాద్రి రామయ్య ఆలయానికి 10లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆయన ప్రతినిధులు భద్రాచలం వచ్చి ఆలయ ఈవో రమాదేవికి రూ.10లక్షల చెక్కుని అందించారు. ప్రభాస్ తరపున తాము ఈ చెక్కు ఇచ్చినట్టు తెలిపారు.



ఈ విరాళంతో ఏం చేస్తారంటే..?

ప్రభాస్ పంపించిన 10లక్షల రూపాయల విరాళాన్ని.. అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాలకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. ప్రభాస్‌ శ్రీరాముడిగా నటింటిన ఆదిపురుష్‌ సినిమా విజయవంతం కావాలని ప్రధానాలయంలో మూలవిరాట్‌ కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరో ప్రభాస్ కి ప్రసాదాన్ని పంపించారు ఆలయ అర్చకులు.

ఆదిపురుష్ మేనియా మొదలైంది..

ప్రభాస్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా ఆది పురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్.. సీత పాత్రలో నటించారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపిస్తారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా ప్రమోషన్ ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలను కూడా పెద్ద పండగలా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులకు థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శించారు. సినిమా విడుదలకు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టించబోతున్నారు.

First Published:  14 May 2023 10:39 AM GMT
Next Story