Telugu Global
Telangana

రోడ్డుపై అమ్మాయిని కొట్టిన యువకుడిని నిలదీసిన హీరో నాగశౌర్య

వెంటనే కారు దిగి ఆమెపై ఎందుకు చెయ్యి చేసుకున్నావు అంటూ ఆ యువకుడిని నిలదీశాడు. ఆమెకు క్షమాపణ చెప్పాలి అంటూ ఆ అబ్బాయిని పట్టుబట్టాడు.

రోడ్డుపై అమ్మాయిని కొట్టిన యువకుడిని నిలదీసిన హీరో నాగశౌర్య
X

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సంఘటనను నిలదీసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కారులో వెళుతున్న నాగశౌర్య నడిరోడ్డుపై ఒక అబ్బాయి ఒక అమ్మాయిపై చెయ్యి చేసుకోవడం చూశాడు. వెంటనే కారు దిగి ఆమెపై ఎందుకు చెయ్యి చేసుకున్నావు అంటూ ఆ యువకుడిని నిలదీశాడు. ఆమెకు క్షమాపణ చెప్పాలి అంటూ ఆ అబ్బాయిని పట్టుబట్టాడు. కానీ, అతను మాత్రం క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు.

ఆమె నా లవర్.. నా ఇష్టం.. అంటూ బదులివ్వడంతో నాగశౌర్య అతని చెయ్యి పట్టుకొని క్షమాపణ చెప్పే వరకు వదిలేదు లేదంటూ చెప్పాడు. ఈ సంఘటనకి సంబంధించిన వీడియో బయటకి రావడంతో, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళల పట్ల నాగశౌర్య చూపించిన గౌరవ మర్యాదలకు హ్యాట్సాఫ్ అంటున్నారు.

ఇంతకీ ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే క్లారిటీ మాత్రం అందులో లేదు. ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల పనులు చేస్తున్న తరుణంలో ఇది నిజామా..? ప్రాంకా..? అని కొందరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

First Published:  28 Feb 2023 1:25 PM GMT
Next Story