Telugu Global
Telangana

ఇకపై హైదరాబాద్‌లో డీజే సౌండ్స్ నిషేధం

హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధించారు. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇకపై హైదరాబాద్‌లో డీజే సౌండ్స్ నిషేధం
X

హైదరాబాద్ నగర పరిధిలో డీజేలపై నిషేధం విధించారు. ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ను నిషేధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజే సౌండ్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్‌ 100కు ఫిర్యాదులు పెరగడంతో నగర పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

సౌండ్ సిస్టంకు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. అలాగే, మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా నిషేధమని సీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని చెప్పారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ హెచ్చారించారు.

First Published:  1 Oct 2024 9:23 AM GMT
Next Story