ఈ రోజు హైదరాబాద్ లో భారీ వర్షాలు... హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
IMD-H ప్రకారం, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
BY Telugu Global18 March 2023 9:43 AM GMT

X
Telugu Global18 March 2023 9:43 AM GMT
హైదరాబాద్ లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారత వాతావరణ శాఖ – హైదరాబాద్ (IMD) హెచ్చరిక జారీ చేసింది. సాయంత్రం ప్రారంభమై రాత్రి వరకు బలమైన ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
IMD-H ప్రకారం, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని IMD సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారికి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story