Telugu Global
Telangana

కేసీఆర్, కుమారస్వామి సమావేశం...కలిసి పని చేయడానికి కుమార స్వామి ఓకే

ఈ రోజు మధాహ్నం ప్రగతి భవన్ లో తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపిన ఇరువురు జాతీయ రాజకీయాల్లో కలిసి సాగాలన్న నిర్ణయానికి వచ్చారు.

కేసీఆర్, కుమారస్వామి సమావేశం...కలిసి పని చేయడానికి కుమార స్వామి ఓకే
X

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల‌ పాటు ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు.

దేశంలో బీజేపీ విపక్ష పార్టీలను బలహీన పర్చేందుకు చేస్తున్న కుట్రలను ఎదుర్కోవాలని, దేశానికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలన్న కేసీఆర్ సూచనలకు కుమార స్వామి సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్డీఏ, యూపీఏ తరహా పీపుల్ ఫ్రంట్ అవశ్యకతక ఉన్నదని ..సీఎం కేసీఆర్ అభిప్రాయ పడినట్లుగా తెలుస్తోంది. తాను పెట్టబోయే జాతీయ పార్టీ గురించి కుమారస్వామికి వివరించారు సీఎం కేసీఆర్. పార్టీ అజెండా, అంశాలను వివరించారు.

జాతీయ స్థాయి రాజకీయ ప్రత్యామ్నాయం గురించి కేసీఆర్ ఆలోచనలను తెలుసుకున్న కుమార స్వామి కేసీఆర్ ను ప్రశంసించినట్టు తెలిసింది. కేసీఆర్ తో కలిసి సాగడానికి జనతాదళ్ ఎస్ సిద్దంగా ఉన్నట్టు కుమార స్వామి స్పష్టం చేసినట్టు సమాచారం.

శనివారం రాత్రి 10 గంటలకు కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి ఐటీసీ గ్రాండ్‌ కాకతీయలో బస చేశారు. ఆదివారం ఉదయం ఆయన మంత్రి కేటీఆర్ తో సమావేశమై చర్చలు జరిపారు.అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్ కు వచ్చిన కుమారస్వామి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ ఇద్దరి చర్చలు కేసీఆర్ జాతీయ‌ రాజకీయాల ప్రణాళికకు మరింత ఊపుతెస్తుందని టీఆరెస్ వర్గాలు భావిస్తున్నాయి.

First Published:  11 Sep 2022 12:14 PM GMT
Next Story