Telugu Global
Telangana

ఎంపీ అర్వింద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్

ఎంపీ అర్వింద్ దళితుల మనోభావాలను దెబ్బతీశారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరితూ నిజామాబాద్ ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌లో బంగారు సాయిలు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఎంపీ అర్వింద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్
X

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అతనిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ ఎదుర్కోవల్సిందే అని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విచారణ కొనసాగించవచ్చని పోలీసులకు ఆదేశించింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గతంలో ఎస్సీ, ఎస్టీ చట్టానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.

ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆయన దళితుల మనోభావాలను దెబ్బతీశారని.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరితూ నిజామాబాద్ ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌లో బంగారు సాయిలు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. పోలీసులు దానిపై కేసు నమోదు చేశారు. అయితే అర్వింద్ హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యాఖ్యలు చేయడంతో.. నిజామాబాద్ పోలీసులు కేసును మాదన్నపేటకు బదిలీ చేశారు.

కాగా, తనపై మాదన్నపేట పోలీసులు విచారణ చేయకుండా ఉండేందుకు ఈ కేసుపై అర్వింద్ స్టే తెచ్చుకున్నారు. ఆయన చట్టప్రకారం విచారణ తప్పించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు కూడా ఇన్ని రోజులు విచారణ చేయలేదు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిరుడు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ కొనసాగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై అర్వింద్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు మాత్రం ఆ పిటిషన్ కొట్టేసి.. విచారణ ఎదుర్కోవాల్సిందేనని తీర్పు చెప్పింది. అయితే అర్వింద్‌పై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. దీంతో అర్వింద్ ఈ కేసులో విచారణను ఎర్కుకోక తప్పడం లేదు.

First Published:  18 March 2023 5:16 AM GMT
Next Story