Telugu Global
Telangana

కేసీఆర్ నిజంగానే ఏపీకి కృష్ణా నీళ్లిచ్చారా..?

కేసీఆర్ నిజంగానే కృష్ణా వాటర్‌ ఏపీకి తరలించారా..? అంటే లేదు. ఎందుకంటే జగన్‌ అసెంబ్లీలో మాట్లాడిన ఫుల్ వీడియో చూస్తే అర్థమయ్యే విషయం ఇదే.

కేసీఆర్ నిజంగానే ఏపీకి కృష్ణా నీళ్లిచ్చారా..?
X

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం సుదీర్ఘ చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీలో జగన్‌ మాట్లాడిన ఓ వీడియోను తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించింది. అది కూడా ట్విట్టర్‌లో చాకీరేవు అనే ఓ ట్రోల్‌ పేజ్‌ ఎడిట్ చేసిన వీడియో. ఈ వీడియో ఆధారంగా ఏపీకి కేసీఆర్ కృష్ణా వాటర్ ఇచ్చారంటూ ప్రచారం మొదలుపెట్టింది.

అయితే కేసీఆర్ నిజంగానే కృష్ణా వాటర్‌ ఏపీకి తరలించారా..? అంటే లేదు. ఎందుకంటే జగన్‌ అసెంబ్లీలో మాట్లాడిన ఫుల్ వీడియో చూస్తే అర్థమయ్యే విషయం ఇదే. కృష్ణా ప్రాజెక్టులు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. ఈ ఏడాది కర్ణాటకలో వర్షాలు లేక దిగువకు చుక్క నీరు రాని పరిస్థితి. కొద్దిపాటి వర్షాలు పడినప్పటికి కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు వచ్చేది చాలా తక్కువ. దీంతో ప్రధాన ప్రాజెక్టులు శ్రీశైలం, సాగర్‌ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.

అయితే కేసీఆర్ ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్‌కు ఓ ప్రతిపాదన పెట్టారు. గోదావరిలో ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల‌ నీరు సముద్రం పాలవుతున్నాయని.. ఆ నీటిని కృష్ణా ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌కు మళ్లించుకుని ఆయకట్టును కాపాడుకుందామని ప్రతిపాదించారు. ఈ సందర్భంగానే బేసిన్లు లేవు.. బేషజాలు లేవు అనే మాటను కేసీఆర్ ఉపయోగించారు. అయితే ఈ ప్రతిపాదన తర్వాత జరిగిన ఇద్దరు సీఎంల మధ్య జరిగిన ఓ సమావేశంలో ఆ దిశగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. కానీ, తర్వాత ఇందుకు సంబంధించి అడుగులు ముందుకు పడలేదు.

కానీ, కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ కృష్ణా నీటిని ఏపీకి విడుదల చేశారన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ జరిగిందన్నట్లుగా సీఎం, మంత్రులు కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  13 Feb 2024 5:08 AM GMT
Next Story