Telugu Global
Telangana

ఫసల్ బీమా గుజరాత్ లో ఎందుకు లేదు..? బండికి హరీష్ సూటి ప్రశ్న

దేశంలోని 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారని గుర్తు చేశారు హరీష్ రావు. దీనిని బట్టి ఆ పథకం ఎంత ప్రయోజనకారో అర్థం చేసుకోవాలని చెప్పారు

ఫసల్ బీమా గుజరాత్ లో ఎందుకు లేదు..? బండికి హరీష్ సూటి ప్రశ్న
X

తెలంగాణలో ఫసల్‌ బీమా యోజన అమలు చేయాలంటూ బండి సంజయ్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పథకం బీజేపీ పాలిత రాష్ట్రం, మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో కూడా అమలులో లేదని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. ఫసల్ బీమా యోజన పథకాన్ని గుజరాత్‌ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా? అంటూ ట్విట్టర్‌ వేదికగా బండిని ప్రశ్నించారు హరీష్ రావు.


దేశంలోని 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారని గుర్తు చేశారు హరీష్ రావు. దీనిని బట్టి ఆ పథకం ఎంత ప్రయోజనకారో అర్థం చేసుకోవాలని చెప్పారు. రైతులకు అండగా ఉండేందుకు ఎకరారు రూ. 10 వేలు చొప్పున సీఎం కేసీఆర్ నష్టపరిహారం ప్రకటించారన్నారు. కేసీఆర్ రైతుబిడ్డ కావడం వల్లే రైతుల కష్టాలు అర్థం చేసుకున్నారని చెప్పారు.

దేశంలో ఎక్కడైనా ఇలా చేశారా..?

దేశంలో ఇంకెక్కడైనా తెలంగాణకంటే ఎక్కువ సాయం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉదాహరణలున్నాయా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. వ్యవసాయాన్ని పండగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత తమదేనన్నారు. సాగు రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ అదానీ ఆదాయాన్ని డబుల్‌ చేసిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ..నల్ల చట్టాలను తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర బీజేపీదేనన్నారు హరీష్ రావు.

First Published:  24 March 2023 11:57 AM GMT
Next Story