Telugu Global
Telangana

నా రంగు గురించి విమర్శిస్తే అగ్గిలా మారి వణికిస్తా.. ట్రోలర్స్‌కు గవర్నర్ తమిళ్ సై ఘాటు వార్నింగ్

తన రంగు గురించి, తన నుదురు గురించి విమర్శించేవారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరుకుంటానని వ్యాఖ్యానించారు. తన గురించి ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని.. నిప్పు కణంలా మారతాను..అంటూ హెచ్చరికలు చేశారు.

నా రంగు గురించి విమర్శిస్తే అగ్గిలా మారి వణికిస్తా.. ట్రోలర్స్‌కు గవర్నర్ తమిళ్ సై ఘాటు వార్నింగ్
X

ఇటీవల కొందరు శరీర రంగు గురించి కూడా విమర్శలు చేయడం పెరిగిపోయింది. ఆ మధ్య భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శరీర రంగు గురించి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మంత్రి కూడా నోరు పారేసుకున్నారు. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళ్ సై కూడా ఇటీవల కాలంలో అటువంటి విమర్శలే ఎదుర్కొంటున్నారు. అయితే అటువంటివారికి తాజాగా గవర్నర్ తమిళ్ సై ఘాటు హెచ్చరికలు చేశారు. తన శరీర రంగు గురించి కొందరు పదేపదే విమర్శలు చేస్తున్నారని, తాను నల్లగా ఉన్నానని అనేవారిని అగ్గిలా మారి వణికిస్తానని హెచ్చరించారు.

తాజాగా గవర్నర్ తమిళ్ సై చెన్నైలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె తనని ట్రోల్ చేసేవారిపై తీవ్ర విమర్శలు చేశారు. తన శరీర రంగు గురించి కొందరు అదేపనిగా విమర్శలు చేస్తున్నారని, తాను నల్లగా ఉన్నానని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా..అని ఘాటుగా హెచ్చరించారు. తనది నలుపు రంగు అని, తన నుదురు బట్టతలలా ఉందని కొంతమంది హేళన చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

తన రంగు గురించి, తన నుదురు గురించి విమర్శించేవారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరుకుంటానని వ్యాఖ్యానించారు. తన గురించి ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని.. నిప్పు కణంలా మారతాను..అంటూ హెచ్చరికలు చేశారు. తమిళ్ సై రంగు గురించి కొందరు తరచూ విమర్శలు చేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా నెటిజన్లు గవర్నర్ తమిళ్ సైని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ తమిళ్ సై దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Next Story