Telugu Global
Telangana

పేదలకు గుడ్‌న్యూస్‌.. LRSపై రేవంత్‌ కీలక నిర్ణయం

మార్చి 31 లోపు మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లే-అవుట్‌లను క్రమబద్ధీకరించనున్నారు.

పేదలకు గుడ్‌న్యూస్‌.. LRSపై రేవంత్‌ కీలక నిర్ణయం
X

తెలంగాణలో లే-అవుట్‌ రెగ్యూలరైజేషన్ స్కీమ్‌ దరఖాస్తులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా మార్చి 31 లోపు మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లే-అవుట్‌లను క్రమబద్ధీకరించనున్నారు. గతంలో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు.

నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క LRS దరఖాస్తుల పెండింగులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అప్పట్లో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది.

First Published:  26 Feb 2024 1:24 PM GMT
Next Story