Telugu Global
Telangana

వజ్రోత్సవ వేళ.. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..

దీంతో ఒక్కసారిగా పింఛన్ల సంఖ్య 46 లక్షలకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్క నెలలోనే ఈ స్థాయిలో భారీగా పింఛన్ల సంఖ్య పెంచడం ఇదే తొలిసారి. స్వాతంత్ర దినోత్సవ వేళ ఆయా వర్గాలకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

వజ్రోత్సవ వేళ.. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..
X

ఇప్పటివరకు తెలంగాణలో 36 లక్షలమందికి సామాజిక పింఛ‌న్లు అందుతున్నాయి. ఇకపై ఆ సంఖ్య 46 లక్షలకు పెరగబోతోంది. ఆగస్ట్ 15నుంచి తెలంగాణలో 10 లక్షలమందికి నూతన పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 75 ఏళ్ల భారత స్వాతంత్ర సంబరాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్లు నిండినవారందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వబోతున్నారు అధికారులు. దీనికి సంబంధించి బార్ కోడ్లతో కూడిన పింఛన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, డయాలసిస్ రోగులకు కూడా పింఛన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఒక్కసారిగా పింఛన్ల సంఖ్య 46 లక్షలకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్క నెలలోనే ఈ స్థాయిలో భారీగా పింఛన్ల సంఖ్య పెంచడం ఇదే తొలిసారి. స్వాతంత్ర దినోత్సవ వేళ ఆయా వర్గాలకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

అన్నిటిపై జీఎస్టీ, అన్నింటా జీఎస్టీ..

తమ ప్రభుత్వం ఆయా వర్గాలకు పింఛన్లు ఇస్తూ, రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే.. కేంద్రం మాత్రం జీఎస్టీ పేరుతో బడుగు బలహీన వర్గాలను మరింత ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు కేసీఆర్. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్. 28 శాతం జీఎస్టీ వల్ల బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. గాలి మీద తప్ప కేంద్రం అన్నింటిపైనా పన్ను వేస్తోందని మండిపడ్డారాయన. అల్పాదాయ వర్గాల వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. దేశ ఆర్థిక ప్రగతిని కేంద్రం నాశనం చేస్తోందని విమర్శించారు. నూతన పింఛన్ విధానంతో అదనంగా 10లక్షలమంది పేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు కేసీఆర్.

First Published:  7 Aug 2022 2:15 AM GMT
Next Story