Telugu Global
Telangana

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఒకటి, రెండు రోజుల్లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌

మేనిఫెస్టోలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఒకటి, రెండు రోజుల్లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌
X

తెలంగాణలో ఒకటి, రెండు రోజుల్లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని సమాచారం. దాదాపు 600 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. గ‌త‌ బీఆర్ఎస్ ప్రభుత్వం 503 పోస్టుల భర్తీకి గ్రూప్‌ - 1 2022 ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది.

అక్టోబర్‌ 2022లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అయితే ప్రశ్నాపత్రం లీక్ జరిగిన కారణంగా పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2023లో మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే అవతవకలు జరిగాయంటూ మరోసారి హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

ఇక మేనిఫెస్టోలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది. గత నోటిఫికేషన్‌లో ఉన్న 503 పోస్టులకు అదనంగా మరో 97 పోస్టులను జోడించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం.

First Published:  1 Feb 2024 6:08 AM GMT
Next Story