Telugu Global
Telangana

రేషన్ డీలర్లకు బంపర్ ఆఫర్.. రెట్టింపయిన కమీషన్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ఇతర అధికారులు.. రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారికి సంతోషాన్నిచ్చే నిర్ణయాలు ప్రకటించారు.

రేషన్ డీలర్లకు బంపర్ ఆఫర్.. రెట్టింపయిన కమీషన్
X

తెలంగాణలో కొన్నాళ్లుగా రేషన్ డీలర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. వారు ఆశించిన దానికంటే ఎక్కువగానే ప్రభుత్వం కమీషన్ పెంచింది. ప్రస్తుతం క్వింటాల్ కి రూ.70 కమీషన్ ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని రూ.140కి పెంచింది ప్రభుత్వం. అంతే కాదు, రేషన్ డీలర్లకు హెల్త్ కార్డ్ లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. కరోనా టైమ్ లో చనిపోయిన రేషన్ డీలర్ల స్థానంలో వారి కుటుం సభ్యులకే రేషన్ దుకాణాలు కేటాయిస్తూ భరోసానిచ్చింది.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ఇతర అధికారులు.. రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారికి సంతోషాన్నిచ్చే నిర్ణయాలు ప్రకటించారు.

గౌరవ వేతనం కుదరదు..

కమీషన్ వద్దు, దాని స్థానంలో గౌరవ వేతనం కావాలంటూ కొంత కాలంగా రేషన్ డీలర్లు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈసారి చర్చల్లో కూడా గౌరవ వేతనం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. దాని బదులలుగా కమీషన్ ని రెట్టింపు చేయడంతో రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వారికి మరిన్ని వరాలు ప్రకటిస్తామని కూడా మంత్రులు హామీ ఇచ్చారు.

First Published:  8 Aug 2023 9:33 AM GMT
Next Story