Telugu Global
Telangana

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టైపెండ్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం

విద్యార్థులకు, సీనియర్ రెసిడెంట్లకు పెంచిన 15 శాతం స్టైపెండ్, హానరోరియమ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్వర్లుల్లో పేర్కొన్నారు.

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టైపెండ్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం
X

తెలంగాణలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచి 15 శాతం మేర స్టైపెండ్‌ను పెంచుతున్నట్లు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని వైద్య కళాశాల్లో చదువుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్పుల చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెంచారు. అలాగే సీనియర్ రెసిడెంట్లకు హానరోరియం కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు, సీనియర్ రెసిడెంట్లకు పెంచిన 15 శాతం స్టైపెండ్, హానరోరియమ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్వర్లుల్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గతంలోనే విద్యార్థులకు స్టైపెండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆర్థిక శాఖ అనుమతితో వైద్యారోగ్య శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లకు రూ.22,527 నుంచి రూ.25,906కు స్టైపెండ్ పెంచారు. ఇక పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు రూ.50,385 నుంచి రూ.58,289కి రెండో ఏడాది విద్యార్థులకు రూ.53,503 నుంచి రూ.61,528కి, మూడో ఏడాది విద్యార్థులకు రూ.56,319 నుంచి రూ.64,767కి పెంచారు.

పీజీ డిప్లోమా మొదటి ఏడాది విద్యార్థులకు రూ.50,686 నుంచి రూ.58,289కి, రెండో ఏడాది విద్యార్థులకు రూ.53,503 నుంచి రూ.61,528కి పెంచారు. సూపర్ స్పెషాలిటీ మొదటి ఏడాది విద్యార్థులకు రూ.80,500 నుంచి రూ.92,575కి, రెండో ఏడాది విద్యార్థులకు రూ.84,525 నుంచి రూ.97,525కి, మూడో ఏడాది విద్యార్థులకు రూ.88,547 నుంచి రూ.1,01,829కి పెంచారు.

ఎండీఎస్ మొదటి ఏడాది విద్యార్థులకు రూ.50,686 నుంచి రూ.58,289కి, రెండో ఏడాది విద్యార్థులకు రూ.53,503 నుంచి రూ.61,528కి, మూడో ఏడాది విద్యార్థులకు రూ.56,319 నుంచి రూ.64,767కి పెంచారు. సీనియర్ రెసిండెట్స్ హానరోరియంను రూ.80,500 నుంచి 92,575కు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

First Published:  27 May 2023 12:42 PM GMT
Next Story