Telugu Global
Telangana

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆర్టీసీలోని మొత్తం 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించింది. జూన్ 1 నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం ఫిట్ మెంట్ అమలులోకి వస్తుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలోని మొత్తం 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు.

భారం ఎంతంటే..?

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేసిన మహిళల ఉచిత రవాణా పథకం ద్వారా ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీపై పెను భారం పడింది. అయితే దీన్ని ప్రభుత్వం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది కాబట్టి, ఆమేరకు ఆక్యుపెన్సీ రేషియో పెరిగి ఆర్టీసీకి మేలు జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాల పెంపు ద్వారా ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల భారం పడుతుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆ సంగతేమైంది..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్ పాస్ చేసింది. అయితే అది చట్టంగా మారి అమలయ్యేలోపు ఎన్నికలొచ్చాయి, ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విషయం చర్చకు రాలేదు. ఉద్యోగుల తరపునుంచి కూడా ఆ డిమాండ్ పెద్దగా వినిపించలేదు. ఈలోగా పీఆర్సీ ప్రకటనతో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తమ హయాంలో తీసుకొచ్చిన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లు సంగతేంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  9 March 2024 12:41 PM GMT
Next Story