Telugu Global
Telangana

ఫామ్‌హౌస్ నిందితుడు నందకుమార్‌కు షాక్

డెక్కన్ కిచెన్ హోటల్ ఇల్లీగల్ నిర్మాణం అని అధికారులు వెల్లడించారు. వీటిపై నోటీసులు ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో కూల్చివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఫామ్‌హౌస్ నిందితుడు నందకుమార్‌కు షాక్
X

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు య‌త్నించిన కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందకుమార్‌కి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. నందకుమార్‌‌కు సంబంధించిన పలు నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లీజ్‌కి తీసుకున్న ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌ని కొంత భాగాన్ని జేసీబీతో కూల్చివేశారు. ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ హోటల్ మినహా దాని ఎదురుగా ఉన్న కమర్షియల్ ప్లేస్‌లోని నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు.

Advertisement

అయితే, డెక్కన్ కిచెన్ హోటల్ ఇల్లీగల్ నిర్మాణం అని అధికారులు వెల్లడించారు. వీటిపై నోటీసులు ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో కూల్చివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డెక్కన్ కిచెన్‌ను ప్రమోద్ అనే భాగస్వామితో నందకుమార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా నిర్మాణం చేసి వ్యాపారాలకు వాడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు డెక్కన్ కిచెన్ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

నందకుమార్‌కు చెందిన ఐస్‌క్రీం పార్లర్ షాప్ (ది టంగ్ ట్రావెల్లర్)ను అధికారులు కూల్చివేశారు. అనంతరం పక్కనే ఉన్న మొబైల్ షాపును కూల్చివేస్తున్నట్లు తెలిపారు. అయితే, అక్ర‌మంగా నిర్మించిన ఈ నిర్మాణాలపై పలుమార్లు నోటీసులు జారీచేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయినా ఎటువంటి రిప్లయ్ రాలేదని.. నిర్మాణ పనులు కూడా ఆపలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నామని చెబుతున్నారు.

Next Story