Telugu Global
Telangana

రేపు రెండుచోట్ల కేసీఆర్ నామినేషన్.. మీటింగ్ మాత్రం కామారెడ్డిలోనే

సీఎం కేసీఆర్ రేపు హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కలసి ఆయన నామినేషన్ వేస్తారు. గజ్వేల్ లో నామినేషన్ వేసిన అనంతరం అక్కడినుంచి హెలికాప్టర్ లో కామారెడ్డికి వెళ్తారు.

రేపు రెండుచోట్ల కేసీఆర్ నామినేషన్.. మీటింగ్ మాత్రం కామారెడ్డిలోనే
X

గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో సీఎం కేసీఆర్ రేపు నామినేషన్ వేస్తారు. ఇప్పటికే కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి, వాటిపై సంతకాలు పెట్టారు కేసీఆర్. రేపు గజ్వేల్, కామారెడ్డిలో ఆ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా తన సిట్టింగ్ స్థానం గజ్వేల్, ఆ తర్వాత కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేస్తారు.

షెడ్యూల్ ఇదే..

సీఎం కేసీఆర్ రేపు హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కలసి ఆయన నామినేషన్ వేస్తారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వస్తాయి. గజ్వేల్ లో నామినేషన్ వేసిన అనంతరం అక్కడినుంచి హెలికాప్టర్ లో కేసీఆర్ కామారెడ్డికి వెళ్తారు. కామారెడ్డిలో ముందుగా నామినేషన్ ఘట్టం పూర్తవుతుంది. అనంతరం అక్కడే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. నామినేషన్ కార్యక్రమాలు ఉండటంతో రేపు కామారెడ్డిలో మాత్రమే బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

రేపు కామారెడ్డి సభతో సీఎం కేసీఆర్ తొలిదశ ప్రచారం పూర్తవుతుంది. ఈనెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈనెల 28న గజ్వేల్‌ సభతో ప్రచారం ముగిస్తారు. ఈ రెండు దశలు కలిపి రాష్ట్రంలో మొత్తం 95 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించినట్టవుతుంది. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి హైదరాబాద్ లో ఈనెల 25న భారీ ప్రజా ఆశీర్వాద సభ జరుగుతుంది. చివరిగా ఈనెల 28న గజ్వేల్ లో సభ జరుగుతుంది.

First Published:  8 Nov 2023 7:15 AM GMT
Next Story