Telugu Global
Telangana

తెలంగాణలో మరో రూ.3,300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో భారీ యూనిట్ నెలకొల్పడానికి గతంలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.

తెలంగాణలో మరో రూ.3,300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్
X

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టిన ఫాక్స్‌కాన్ సంస్థ.. ఇంకా తమ యూనిట్ ప్రారంభించక ముందే మరింత పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ కంపెనీకి మాన్యుఫ్యాక్చరర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో భారీ యూనిట్ నెలకొల్పడానికి గతంలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. గతంతో రూ.1,250 కోట్లు (150 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడతామని చెప్పింది. అయితే, ఇక్కడి మౌలిక వసతులు, వాతావరణం, ప్రభుత్వ సహకారం చూసిన ఫాక్స్‌కాన్ తాజాగా ఆ పెట్టుబడికి అదనంగా 400 మిలియన్ డాలర్లు (రూ..3,300 కోట్లుకు పైగా) పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకున్నది. ఈ మేరకు తాజాగా ఫాక్స్‌కాన్ కీలక ప్రకటన చేసింది.

ఫాక్స్‌కాన్ సంస్థ పెట్టుబడులను పెంచిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫాక్స్‌కాన్ సంస్థ గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్ గ్రూప్ తమ స్నేహాన్ని మరింత ధృఢపరచడానికి అంగీకరించిందని.. ఇందుకు తాజా పెట్టుబడే సాక్ష్యమని అన్నారు.

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్లో రూ.1,656 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు మే 15న మంత్రి కేటీఆర్ భూమి పూజ చేసి ప్రారంభించారు.


First Published:  12 Aug 2023 12:53 PM GMT
Next Story