Telugu Global
Telangana

కంటి వెలుగు కార్యక్రమంలో నలుగురు ముఖ్యమంత్రులు..

అంతకు ముందు ఖమ్మంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రాంరభించారు. కేరళ సీఎం విజయన్‌ చేతుల మీదుగా కలెక్టరేట్‌ భవన శిలాఫలకం ఆవిష్కరింపజేశారు.

కంటి వెలుగు కార్యక్రమంలో నలుగురు ముఖ్యమంత్రులు..
X

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరి వెళ్లారు. అక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకంటే ముందు కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్, కేరళ సీఎం పినరయి విజయన్ చేతులల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు ఈ కార్యక్రమంలో కేసీఆర్ వెంట ఉన్నారు.


కంటి వెలుగు రెండో విడత..

అంతకు ముందు ఖమ్మంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రాంరభించారు. కేరళ సీఎం విజయన్‌ చేతుల మీదుగా కలెక్టరేట్‌ భవన శిలాఫలకం ఆవిష్కరింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు నేతలు. పలువురికి కళ్లజోళ్లు అందించారు. కలెక్టరేట్‌లో కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ను నేతలు తిలకించారు.

రేపటి నుంచి కంటి పరీక్షలు..

తెలంగాణ వ్యాప్తంగా రేపటినుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విస్తృతంగా మొదలవుతుంది. ఇందులో భాగంగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కళ్లజోళ్లు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. తొలి విడత కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణలో విజయవంతమైంది. లక్షలాది మందికి ప్రభుత్వమే ఉచితంగా కంటి అద్దాలు అందించింది. రెండో విడతగా కూడా ఈ బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు రెండోవిడతలో తెలంగాణ సహా మొత్తం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం విశేషం.

First Published:  18 Jan 2023 10:04 AM GMT
Next Story