Telugu Global
Telangana

మంత్రి సురేఖకు మాజీ మంత్రి సబిత కౌంటర్.. వాళ్ళు బాధపడరా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

మంత్రి సురేఖకు మాజీ మంత్రి సబిత కౌంటర్.. వాళ్ళు బాధపడరా?
X

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. కేటీఆర్‌పై నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని ఆమె ఎక్స్ వేదిన ట్వీట్ చేశారు. సురేఖమ్మా, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది, మాజీ మంత్రి కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి విమర్శించే ఆస్కారం ఇవ్వకూడదని రాసుకొచ్చారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలని, తద్వారా సమాజానికి ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు.

మీరు చేసిన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? అని మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి ప్రశ్నించారు. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారని, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణమయ్యారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇదిలా ఉండగా, కొండా సురేఖ మీద సోషల్ మీడియా ట్రోల్స్‌ను కూడా సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. తోటి మహిళగా కొండా సురేఖ బాధని తాను అర్థం చేసుకోగలనని, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పుడు బాధ్యతగా ఉండాలని నిన్న సబితా పోస్ట్ పెట్టారు.

First Published:  2 Oct 2024 11:16 AM GMT
Next Story