Telugu Global
Telangana

మ‌ల్లారెడ్డిని తిట్ట‌క‌పోతే జ‌గ్గారెడ్డికి న‌డ‌వ‌ద‌ట‌!

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాపం ఎంపీ టికెట్ కోసం పాకులాడుతున్నాడు. అందుకే మొన్న‌టి దాకా తిట్టిన రేవంత్‌రెడ్డిని ఇప్పుడు మ‌స్తు పొగుడుతున్నాడ‌ని మ‌ల్లారెడ్డి కామెంట్ చేశారు.

మ‌ల్లారెడ్డిని తిట్ట‌క‌పోతే జ‌గ్గారెడ్డికి న‌డ‌వ‌ద‌ట‌!
X

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఏ మాట మాట్లాడినా జ‌నాల నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆయ‌న మాటతీరే అంత‌. లోప‌లేమీ దాచుకోకుండా ఉన్న‌దున్న‌ట్లు ముఖం మీదే మాట్లాడేస్తారు. ఎంపీ ఎన్నిక‌ల్లో త‌మ కుటుంబానికి టికెట్ అడ‌గ‌టం ద‌గ్గ‌ర నుంచి జ‌గ్గారెడ్డి విమ‌ర్శల వ‌ర‌కు అన్నింటి మీద తాజాగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు కామెంట్లు చేశారు.

పాపం ఎంపీ టికెట్ కోసం జ‌గ్గారెడ్డి పాట్లు

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పాపం ఎంపీ టికెట్ కోసం పాకులాడుతున్నాడు. అందుకే మొన్న‌టి దాకా తిట్టిన రేవంత్‌రెడ్డిని ఇప్పుడు మ‌స్తు పొగుడుతున్నాడ‌ని మ‌ల్లారెడ్డి కామెంట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫోక‌స్ కావ‌డం కోస‌మే జ‌గ్గారెడ్డి త‌న పేరు ఎత్తుతున్నార‌న్నారు.. అయినా మ‌ల్లారెడ్డి పేరు చెప్ప‌క‌పోతే జ‌గ్గారెడ్డిని ఎవ‌రూ ప‌ట్టించుకోరంటూ ఎద్దేవా చేశారు.

గోవా వెళ్లిపోయి మ‌స్తు ఎంజాయ్ చేస్తా

కేసీఆర్ కుటుంబంలో ఉన్న‌ట్లే మా కుటుంబంలోనూ ముగ్గురికి ప‌ద‌వులు ఉండాల‌నుకున్నాం. పార్టీ అధినేత ఆదేశిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నా కొడుకు భ‌ద్రారెడ్డి మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ని మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటే గోవాలో త‌న‌కున్న హోట‌ల్‌కు పోయి మ‌స్తు ఎంజాయ్ చేస్తా అని మ‌ల్లారెడ్డి బోల్డ్‌గా చెప్పేశారు.

First Published:  9 Feb 2024 2:28 PM GMT
Next Story