Telugu Global
Telangana

BRS ఓడిపోవాలని నేనే కోరుకున్నా.. ఎంపీ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ స్టాండ్‌ ఏంటన్న దానిపై హుందాగా స్పందించారు కేసీఆర్. తాము ప్రజాస్వామిక వాదులం అన్న ఆయన.. ఏది చేసినా రాజ్యంగ బద్ధంగానే ఉంటుందన్నారు.

BRS ఓడిపోవాలని నేనే కోరుకున్నా.. ఎంపీ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే
X

రేవంత్ సర్కారు ఎక్కువరోజులు ఉండదంటూ మొదట్నుంచి ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌స‌భ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే.. అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం ఉంటుందని స్పష్టంచేశారు.

ఎన్నికలైన పదిపదిహేను రోజుల్లో..

గతంలో 119లో తమకు 111 సీట్లు ఉంటేనే బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెరలేపారన్నారు కేసీఆర్. 64 మంది ఉన్న కాంగ్రెస్‌ను బతికనిస్తారా అని ప్రశ్నించారు. "హిమాచల్‌ప్రదేశ్‌లో ఆల్‌రెడీ బీజేపీ బొక్క పెట్టేసింది. కర్ణాటకలో మరో బాంబు పడేయడానికి రంగం సిద్ధమైంది. తర్వాత మింగేసేది తెలంగాణనే. మాకు వస్తున్న సమాచారం ప్రకారం పార్లమెంట్‌ ఎన్నికలైన పదిపదిహేను రోజులకు తెలంగాణపై మోడీ బాంబు పడబోతోంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.

BRS ఓడిపోవాలని నేనే కోరుకున్నా..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ స్టాండ్‌ ఏంటన్న దానిపై హుందాగా స్పందించారు కేసీఆర్. తాము ప్రజాస్వామిక వాదులం అన్న ఆయన.. ఏది చేసినా రాజ్యంగ బద్ధంగానే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. "ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. నిజంగా బీఆర్‌ఎస్‌ ఒకసారి ఓడిపోతేనే మంచిది అన్నాను. గాడిద ఉంటేనే కదా గుర్రం విలువ తెలుస్తుంది. మళ్లీ వెంటనే నెక్ట్స్‌ టర్మ్‌లో బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వస్తుంది. మనం ఇరవై ఏండ్లు నిశ్చింతంగా, కదలకుండా ఉంటామని చెప్పాను" అన్నారు కేసీఆర్.

First Published:  24 April 2024 5:12 AM GMT
Next Story