Telugu Global
Telangana

బీఆరెస్ ఏర్పాటు...తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు

కేసీఆర్ భారతీయ రాష్ట్రసమితి ఏర్పాటు ప్రకటించగానే తెలంగాణ వ్యాప్తంగా టీఆరెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అనేక జిల్లాల్లో కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచిపెట్టారు.

బీఆరెస్ ఏర్పాటు...తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు
X

కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆరెస్(బీఆరెస్) శ్రేణులు ప్రధాన చౌరస్తాలల్లో బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచిపెట్టారు. కొన్ని జిల్లాల్లో కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.

భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.

నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ శ్రేణలు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని వీటీకాలనీలో ఉన్న శ్రీ పంచముఖ హనుమాన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లుగానే భారతదేశం యొక్క స్థితిగతులు కేసీఆర్‌ నాయకత్వంలో మారాలని ఆంజనేయస్వామిని వేడుకున్నారు.

నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు నార్కట్పల్లిలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. మున్సిపల్ చైర్మన్‌ మందడి సైదీరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. చండూరులో టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్‌ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

యాదగిరిగుట్టలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.

పెద్దపల్లి జిల్లాకేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. 'దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రకటన వెలువడిన వెంటనే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బాణాసంచాలను పెద్ద ఎత్తున కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. 'దేశ్ కీ నేత కేసీఆర్..జై కేసీఆర్ ' అంటూ నినాదాలు చేశారు

First Published:  5 Oct 2022 11:42 AM GMT
Next Story