Telugu Global
Telangana

రేపే బీజేపీ ఫస్ట్‌ లిస్ట్.. వారికి ఛాన్స్‌.!

ప్రతి సీటుకు అదనంగా మరో పేరును ప్రతిపాదించాలని ఢిల్లీ పెద్దలు కోరినట్లు సమాచారం. ఇప్పటికే 70 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం.

రేపే బీజేపీ ఫస్ట్‌ లిస్ట్.. వారికి ఛాన్స్‌.!
X

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితాపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ 55 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. అయితే బీజేపీ లిస్ట్‌ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. సోమవారమే కమలనాథులు ఫస్ట్ లిస్ట్‌ విడుదల చేస్తారని భావించినప్పటికీ.. అది బుధవారానికి వాయిదా పడినట్లు సమాచారం.

ఇక బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో 12 నుంచి 30 మందికి స్థానం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్‌ లిస్టులో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ లాంటి ప్రముఖుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక పార్టీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ల అభ్యర్థిత్వంపై క్లారిటీ లేదు. బండి సంజయ్‌ కరీంనగర్ నుంచి పోటీలో ఉంటానని ప్రకటించిప్పటికీ.. ఆయన పేరు మొదటి జాబితాలో ఉంటుందా లేదా అనేది అనుమానమే.

ప్రతి సీటుకు అదనంగా మరో పేరును ప్రతిపాదించాలని ఢిల్లీ పెద్దలు కోరినట్లు సమాచారం. ఇప్పటికే 70 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం.. అయితే ప్రతి స్థానానికి ఇద్దరి పేర్లు సూచించాలని అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశం కూడా బీజేపీ నేతల లిస్ట్‌ విడుదల ఆలస్యానికి కారణమవుతున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్‌ నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న కొంత మంది అసంతృప్తులు పార్టీలోకి వస్తారని.. వారికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

First Published:  17 Oct 2023 2:39 AM GMT
Next Story