Telugu Global
Telangana

మరో వారం రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. నేడు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ

దాదాపు 40 నియోజకవర్గాలకు ఒక్కరి నుంచే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మరో 30-35 నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు.

మరో వారం రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. నేడు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ నేడు ఢిల్లీలో సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు బాబా సిద్దిఖీ, జిగ్నేష్ మేవాని, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే స‌మావేశంలో పాల్గొంటారు. ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ఒకటి నుంచి మూడు పేర్లతో జాబితా తయారీకి కమిటీ చర్చించనుంది.

అయితే దాదాపు 40 నియోజకవర్గాలకు ఒక్కరి నుంచే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మరో 30-35 నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. ఒకటే దరఖాస్తు వచ్చిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేరును ఫైనల్ చేసి ఈ నెలాఖరులో ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ టికెట్ కోసం మొత్తం 119 నియోజకవర్గాలకు 1006 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన తుమ్మల, జిట్టా, యెన్నం వంటి వారు కూడా టికెట్ రేసులో ఉన్నారు.

*

First Published:  20 Sep 2023 3:40 AM GMT
Next Story