Telugu Global
Telangana

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తొలి పెట్టుబడి..

రక్షణ దళాలకు సంబంధించిన గింబాల్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని మెరియో సంస్థ ప్రతినిధులు తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తొలి పెట్టుబడి..
X

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ సంస్థ మెరియో ముందుకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పెట్టుబడి ఇదే. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో రెమీ ప్లెనిట్‌ సహా ప్రతినిధుల బృందం.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో సెక్రటేరియట్‌లో సమావేశమైంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు సంబంధించిన ప్రణాళికలను మంత్రికి వివరించింది.

రక్షణ దళాలకు సంబంధించిన గింబాల్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని మెరియో సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న HC రోబోటిక్స్ భాగస్వామ్యంతో గింబాల్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే రక్షణశాఖ అధికారులతోనూ చర్చలు పూర్తయ్యాయని చెప్పారు. సంస్థకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని మెరియో సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు.


ఇక స్టార్టప్స్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు శ్రీధర్ బాబు. స్టార్టప్స్‌కు నిధులు రాబట్టడంలో కర్ణాటక కంటే మెరుగ్గా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఐటీ పనితీరుపై ఆ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సహా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు మంత్రి.

First Published:  16 Dec 2023 6:09 AM GMT
Next Story