Telugu Global
Telangana

తెలంగాణ పోలీసులపై బీహార్ లో కాల్పులు

తెలంగాణ పోలీసులపై బీహార్ లో కాల్పులు జరిగాయి. సైబర్ నేరగాళ్ళను పట్టుకోవడానికి బీహార్ వెళ్ళిన పోలీసులపైకి నిందితులు కాల్పులు జరిపారు.

తెలంగాణ పోలీసులపై బీహార్ లో కాల్పులు
X

బీహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్ నేరగాళ్ల కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్ లో వాహనాల కంపెనీల ఫ్రాంచైజీల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడ్డ నిందితులు బీహార్ కు చెందిన వాళ్ళుగా గుర్తించిన తెలంగాణ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు బీహార్ వెళ్లారు. నవాడా జిల్లా భవానీబిగ గ్రామంలో నిందితుల ఆచూకీ లభ్యమైంది. స్థానిక పోలీసుల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు అక్కడికి వెళ్ళిన పోలీసులకు ప్రధాన నిందితుడు మిథిలేష్ ప్రసాద్ సహా మరో నలుగురు నిందితులు కనిపించారు. పోలీసులు వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నించగా ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు.

మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.22 కోట్ల నగదు, మూడు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.

First Published:  15 Aug 2022 3:02 AM GMT
Next Story