Telugu Global
Telangana

సత్తుపల్లిలో రాత్రి 11 వరకు పోలింగ్.. ఫైనల్ పర్సంటేజ్ ఎంతంటే..?

పోలింగ్ శాతం విషయంలో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. ఆ జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాలవారీగా లెక్క తీస్తే.. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.51 శాతం పోలింగ్‌ నమోదైంది.

సత్తుపల్లిలో రాత్రి 11 వరకు పోలింగ్.. ఫైనల్ పర్సంటేజ్ ఎంతంటే..?
X

మావోయిస్ట్ ప్రభావిత 13నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా నియోజకవర్గాల్లో అధికారికంగా 5 గంటలకు ఓటింగ్ ఆపేయగా.. క్యూలైన్లో ఉన్నవారికి మాత్రం ఎంత టైమ్ అయినా అవకాశమిస్తామని చెప్పారు అధికారులు. అలా అవకాశం ఇవ్వడంతో సత్తుపల్లిలో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్‌ లో రాత్రి 8 గంటల వరకు ఓట్లు పడ్డాయి. షాద్‌ నగర్‌ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గూడూరు, తిమ్మాపూర్‌ లోని పోలింగ్‌ కేంద్రాలలో రాత్రి 8.30 దాటాక కూడా పోలింగ్‌ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో 9.30 వరకు ఓట్లు వేస్తున్నారు. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించటంతో 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్‌ ఆలస్యమైంది.

ఫైనల్ పర్సంటేజ్ ఎంత..?

పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం అప్పటికి పోలింగ్ శాతం 63.94 గా తేల్చారు అధికారులు. రాత్రి పోలింగ్ లెక్కలు కూడా వచ్చాక మొత్తం పోల్ పర్సంటేజ్ 70.66 శాతంగా ఉందని ప్రకటించారు. అయితే ఇవి కూడా ఫైనల్ పర్సంటేజ్ లు కావు. ఈ మధ్యాహ్నానికి కరెక్ట్ లెక్కలు చెబుతామంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు.

పోలింగ్ శాతం విషయంలో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. ఆ జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాలవారీగా లెక్క తీస్తే.. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.51 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత పాలేరులో 90.28 శాతం, ఆలేరులో 90.16 శాతం పోలింగ్‌ జరిగింది. హైదరాబాద్‌ ఓటర్లు ఈసారి కూడా పోలింగ్‌ పై ఆసక్తి ప్రదర్శించలేదు. హైదరాబాద్‌ లోని యాకత్‌ పుర నియోజకవర్గంలో అత్యల్పంగా 39.69 శాతం పోలింగ్ నమోదైంది.

First Published:  1 Dec 2023 1:57 AM GMT
Next Story