Telugu Global
Telangana

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన ఐదుగురు కూలీలు మరణించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
X

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు కూలీలు క్రేన్ సహాయంతో పంప్ హౌజ్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కూలీలు మరణించారు. మరొకొరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్ళారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద నిర్మాణంలో ఉన్న పాలమూరు, రంగారెడ్డి ప్యాకేజ్ వన్ లో ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా బీహార్ నుంచి వచ్చిన వలసకూలీలు. ఈ సంఘట్నకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Next Story