Telugu Global
Telangana

అస‌భ్య మెసేజ్‌లు పంపుతున్నాడ‌ని.. కొట్టి చంపేశారు.. - మంచిర్యాల జిల్లాలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం

మ‌హేష్ తీరు మార్చుకోవాల‌ని పెద్ద‌ప‌ల్లి క‌న‌క‌య్య కుటుంబం హెచ్చ‌రించినా.. అత‌ని తీరులో మార్పు రాలేద‌ని, ఈ విష‌య‌మై పోలీసుల‌కు ప‌లుమార్లు పెద్ద‌ప‌ల్లి క‌న‌క‌య్య కుటుంబ‌స‌భ్యులు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

అస‌భ్య మెసేజ్‌లు పంపుతున్నాడ‌ని.. కొట్టి చంపేశారు.. - మంచిర్యాల జిల్లాలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం
X

మంచిర్యాల జిల్లా ఇందారంలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం బైక్‌పై వెళ్తున్న వ్య‌క్తిని అడ్డుకొని అంద‌రూ చూస్తుండ‌గానే న‌డిరోడ్డుపై బండ‌రాయితో కొట్టి చంపేశారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌వారిలో ఇద్ద‌రు పురుషులు, ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. వివాహిత‌కు అస‌భ్య మెసేజ్‌లు పంపుతున్నాడ‌ని ఆగ్ర‌హానికి గురై ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండ‌లం ఇందారంలో హ‌తుడు ముస్కి మ‌హేష్ (25) గంగ‌పుత్రుల కాల‌నీకి చెందిన‌ పెద్ద‌ప‌ల్లి క‌న‌క‌య్య కుమార్తె శృతిని లైంగికంగా వేధిస్తున్నాడ‌ని తెలుస్తోంది. మూడేళ్లుగా వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగిన‌ట్టు స‌మాచారం. ఏడాదిన్న‌ర క్రితం శృతికి ఆమె కుటుంబ స‌భ్యులు వేరే వ్య‌క్తితో వివాహం చేశారు. ఈ నేప‌థ్యంలో తాము స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు మ‌హేష్ శృతి భ‌ర్త‌కు పంపిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శృతి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు స‌మాచారం.

భ‌ర్త మృతితో త‌ల్లిదండ్రుల వ‌ద్దే ఉంటున్న శృతిని మ‌ళ్లీ మ‌హేష్ వేధింపుల‌కు గురిచేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆమెకు అస‌భ్యంగా మెసేజ్‌లు పెడుతున్నాడ‌ని, మ‌ళ్లీ తామిద్ద‌రూ స‌న్నిహితంగా మెల‌గ‌వ‌చ్చ‌ని చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ తీరు మార్చుకోవాల‌ని పెద్ద‌ప‌ల్లి క‌న‌క‌య్య కుటుంబం హెచ్చ‌రించినా.. అత‌ని తీరులో మార్పు రాలేద‌ని, ఈ విష‌య‌మై పోలీసుల‌కు ప‌లుమార్లు పెద్ద‌ప‌ల్లి క‌న‌క‌య్య కుటుంబ‌స‌భ్యులు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

అయినా మ‌హేష్ తీరు మార‌క‌పోవ‌డంతో పెద్ద‌ప‌ల్లి క‌న‌క‌య్య కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆగ్ర‌హంతో అత‌న్ని ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే హ‌త్య చేసిన‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం మంచిర్యాల వెళ్లి పాలు పోసి . తిరిగి గంగ‌పుత్రుల కాల‌నీ మీదుగా వ‌స్తున్న మ‌హేష్‌ను కాపు కాచి దాడి చేసిన‌ట్టు స‌మాచారం. ప‌దునైన ఆయుధాలు, బండ‌రాయితో హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

ఈ హ‌త్య‌లో పెద్ద‌ప‌ల్లి క‌న‌క‌య్య‌, అత‌ని భార్య పెద్ద‌ప‌ల్లి ప‌ద్మ‌, వారి కుమార్తె, కుమారుడు ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. హ‌త్య‌కు సంబంధించిన‌ పూర్తి వివ‌రాల సేక‌ర‌ణ‌లో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు.

First Published:  25 April 2023 7:01 AM GMT
Next Story