Telugu Global
Telangana

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి : కేంద్ర ఎన్నికల సంఘం బృందం

ఎన్నికల్లో డబ్బు వినియోగం తగ్గించాలని.. 2023కు సంబంధించిన రెండవ ఎస్ఎస్ఆర్ పురోగతిని అంచనా వేయాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి : కేంద్ర ఎన్నికల సంఘం బృందం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికార బృందం విజ్ఞప్తి చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాల మేరకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీశ్ కుమార్ వ్యాస్ శనివారం హైదరాబాద్ బుద్ద భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులోతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీనియర్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో డబ్బు వినియోగం తగ్గించాలని.. 2023కు సంబంధించిన రెండవ ఎస్ఎస్ఆర్ పురోగతిని అంచనా వేయాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. ఎన్నికలకు నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రశాంత వాతావరణలో ఎలక్షన్ జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఈసీ అధికారులు ప్రస్తావించిన పలు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.

కాగా, శుక్రవారం 24 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమీక్ష నిర్వహించింది. ఇక శనివారం మిగిలిన 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. ఎన్నికలకు పూర్తిగా సమాయత్తం కావాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేష్ కుమార్, మనోజ్ కుమార్ సాహు, అజయ్ భాడో, సినీయర్ ప్రిన్సిపల్సెక్రటరీలు ఎన్ఎన్ బుటోలియా, అవినాశ్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, మీడియా డైరెక్టర్ జనరల్ నారాయణన్, డైరెక్టర్ ప్లానింగ్ దీపాలి మసిర్కర్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  25 Jun 2023 2:14 AM GMT
Next Story