Telugu Global
Telangana

రేపే నామినేషన్లకు ఆఖరు..ఆ మూడింటిపై తేల్చని కాంగ్రెస్

ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు మంగళవారం బీఫామ్‌లు అందించింది కాంగ్రెస్‌. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానంను మారుస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు ఆయనకే బీఫామ్‌ అందించింది.

రేపే నామినేషన్లకు ఆఖరు..ఆ మూడింటిపై తేల్చని కాంగ్రెస్
X

తెలంగాణలో రేపటితో నామినేషన్ల స్వీకరణకు తెరపడనుంది. అయితే కాంగ్రెస్‌ మాత్రం మరో మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది.

కరీంనగర్‌ నుంచి వెలిచాల రాజేందర్‌ రావు, హైదరాబాద్ నుంచి సమీర్‌ ఉల్లా ఖాన్‌ పేర్లు దాదాపు ఫైనల్ అయ్యాయి. ఈ ఇద్దరు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఖమ్మం విషయంలో పార్టీ హైకమాండ్ తేల్చుకోకపోవడంతో జాబితా ఆలస్యమవుతున్నట్లు సమాచారం. రామసహాయం రఘురామిరెడ్డి పేరు దాదాపు ఖరారైనప్పటికీ.. మరో అభ్యర్థిని పరిశీలించాలని ఒత్తిడి రావడంతోనే అభ్యర్థుల ప్రకటనపై వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు మంగళవారం బీఫామ్‌లు అందించింది కాంగ్రెస్‌. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానంను మారుస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు ఆయనకే బీఫామ్‌ అందించింది. ఎంపీగా పోటీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్‌ హైకమాండ్ వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

First Published:  24 April 2024 3:11 AM GMT
Next Story