Telugu Global
Telangana

ఆ 2 అంశాలు టచ్‌ చేయకుండా.. ఈ మూడింటిపై కేబినెట్‌లో చర్చ

అకాల వర్షాలతో పంట నష్టం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా సంవత్సరం ఆరంభం అవుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్‌ వంటి అంశాలపైనా చర్చించ‌నున్నారు.

ఆ 2 అంశాలు టచ్‌ చేయకుండా.. ఈ మూడింటిపై కేబినెట్‌లో చర్చ
X

ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కొత్త ఎజెండాతో ప్రభుత్వం కేబినెట్ భేటీ నిర్వహిస్తోంది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండీషన్ పెట్టింది ఈసీ. ఉమ్మడి రాజధాని, రుణమాఫీపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొన్న, పాల్గొంటున్న అధికారుల్ని మీటింగ్‌కు పిలవొద్దని నిబంధన పెట్టింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్‌ సమావేశం నిర్వహించ‌నున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అకాల వర్షాలతో పంట నష్టం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా సంవత్సరం ఆరంభం అవుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్‌ వంటి అంశాలపైనా చర్చించ‌నున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలో మరమ్మత్తులపైనా మంత్రివర్గం చర్చించనుంది. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి NDSA బృందం ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం నిధులు కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి శనివారమే తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉన్నా.. ఈసీ అనుమతి లేకపోవడంతో వాయిదా పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రత్యేక అనుమతి కోరగా షరతులతో ఈసీ ఓకే చెప్పింది.

First Published:  20 May 2024 5:48 AM GMT
Next Story