Telugu Global
Telangana

ప్రధానితో ఈనాడు ఎండీ భేటీ.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం

వీరి భేటీ రాజకీయంగా హాట్‌హాట్‌గా మారింది. ఈనాడు పత్రిక టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనేది జగమెరిగిన సత్యమే. అందులో భాగంగానే ఏపీలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఆ పత్రిక నిత్యం కథనాలను వండి వారుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రధానితో ఈనాడు ఎండీ భేటీ.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం
X

ఈనాడు ఎండీ కిరణ్ ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'అజాదీ కా అమృతోత్సవ్' అంటూ ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు ఈనాడు కూడా తన వంతు తోడ్పాటు అందించింది. పత్రికలో ఏడాదిపాటు వరుస కథనాలు వేశారు. ఈ కథనాలకు ఓ పుస్తకంగా రూపొందించగా.. దాన్ని నేడు ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే వీరి భేటీ రాజకీయంగా హాట్‌హాట్‌గా మారింది. ఈనాడు పత్రిక టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనేది జగమెరిగిన సత్యమే. అందులో భాగంగానే ఏపీలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఆ పత్రిక నిత్యం కథనాలను వండి వారుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం ఈనాడు తటస్థ వైఖరినే అవలంభిస్తూ వస్తోంది. ఈనాడు గ్రూపు సంస్థల ఆస్తులన్నీ తెలంగాణలో కేంద్రీకృతమై ఉండటం కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు.

తెలంగాణలో అప్పుడప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తి చూపుతున్నప్పటికీ.. నిత్యం టీఆర్ఎస్ కు ఈనాడు అనుకూలంగానే ఉంటోందని చెబుతుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రధాని మోడీతో ఈనాడు ఎండీ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇక నుంచి తెలంగాణలో ఈనాడు బీజేపీకి మద్దతు ఇవ్వబోతోందంటూ కొందరు బీజేపీ అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజంగానే ఈనాడు అంత ధైర్యం చేసి కేసీఆర్ కు ఎదురెళ్తుందా? అన్నది వేచి చూడాలి.

First Published:  26 Oct 2022 12:41 PM GMT
Next Story