Telugu Global
Telangana

ఆంధ్రప్రభ ఆఫీస్‌లో ఈడీ సోదాలు

లిక్కర్ కేసులో ఉన్న అర్జున్ పాండే ఆంధ్రప్రభ ఏర్పాటు చేసిన ఇండియా అహెడ్‌ ఇంగ్లీష్ ఛానల్‌లో కొంతకాలం సేల్స్ విభాగాధిపతిగా పనిచేశారు.

ఆంధ్రప్రభ ఆఫీస్‌లో ఈడీ సోదాలు
X

ఢిల్లీ లిక్కర్ కేసులో హైదరాబాద్‌లోని పలుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈడీ దాడులు ఆంధ్రప్రభ ఆఫీస్‌నూ తాకాయి. పత్రిక యజమాని ముత్తా గోపాలకృష్ణను ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులకు ఆంధ్రప్రభ గ్రూప్‌తో సంబంధాలున్నట్టు ఈడీ అనుమానిస్తోంది.

లిక్కర్ కేసులో ఉన్న అర్జున్ పాండే ఆంధ్రప్రభ ఏర్పాటు చేసిన ఇండియా అహెడ్‌ ఇంగ్లీష్ ఛానల్‌లో కొంతకాలం సేల్స్ విభాగాధిపతిగా పనిచేశారు. మరొకరు బోయినపల్లి అభిషేక్ ఇండియా అహెడ్‌లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

అర్జున్ పాండే, అభిషేక్‌తో ఎప్పటి నుంచి సంబంధాలున్నాయి అన్న దానిపై యజమాని ముత్తా గోపాలకృష్ణను ఈడీ అధికారులు కాసేపు ప్రశ్నించారు. గతంలో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్ర ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఆంధ్రప్రభ వరకు వచ్చారని తెలుస్తోంది.

First Published:  8 Oct 2022 1:15 AM GMT
Next Story