Telugu Global
Telangana

రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ... విచారణకు హాజరైన ఎమ్మెల్యే

ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా రోహిత్ రెడ్డికి నోటీసులు పంపించింది. అయితే తనకు చాలా తక్కువ సమయం కేటాయించారని, మరో వారం రోజులు గడువు కావాలంటూ రోహిత్ రెడ్డి ఈడీకి లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తోసిపుచ్చారు.

రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ... విచారణకు హాజరైన ఎమ్మెల్యే
X

బీఆరెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. తాను ఈ రోజు విచారణకు హాజరుకాలేనని, తనకు మరో వారంరోజులు సమయం కావాలని ఆయన చేసిన విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది.

కాగా ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా రోహిత్ రెడ్డికి నోటీసులు పంపించింది. అయితే తనకు చాలా తక్కువ సమయం కేటాయించారని, మరో వారం రోజులు గడువు కావాలంటూ రోహిత్ రెడ్డి ఈడీకి లేఖ రాశారు. వరుస సెలవుల కారణంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌... ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేక పోయానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.

అయితే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితిల్లో ఈరోజు తమ ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.

Next Story