Telugu Global
Telangana

మరోసారి నామా ఆస్తుల అటాచ్

రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని దాదాపు 361 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్టు నామాపై ఈడీ అభియోగం. నిధులను వివిధ డమ్మీ కంపెనీలకు మళ్లించి కాజేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.

మరోసారి నామా ఆస్తుల అటాచ్
X

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను ఈడీ మరోసారి అటాచ్‌ చేసింది. ఇది వరకే 96 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా మరో 80.65 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అందులో హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ కార్యాలయం కూడా ఉంది. ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని దాదాపు 361 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్టు నామాపై ఈడీ అభియోగం. నిధులను వివిధ డమ్మీ కంపెనీలకు మళ్లించి కాజేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. మొత్తం 28 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన టీడీపీలో ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగింది. అయితే నామా మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు. మధుకాన్ సంస్థ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తిచేసిందని గుర్తు చేశారు. దర్యాప్తున‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు.

First Published:  17 Oct 2022 10:08 AM GMT
Next Story