Telugu Global
Telangana

న్యాయవాది సమక్షంలోనే ఎమ్మెల్సీ కవిత ఫోన్లను పరిశీలిస్తున్న ఈడీ

కవిత అడ్వొకేట్ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. లాయర్ భరత్ సమక్షంలోనే ఈడీ అధికారులు ఆమో ఫోన్లను చెక్ చేయబోతున్నారు.

న్యాయవాది సమక్షంలోనే ఎమ్మెల్సీ కవిత ఫోన్లను పరిశీలిస్తున్న ఈడీ
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను అనుమానితురాలిగా ఈడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈడీ విచారణ సమయంలో ఆమె వాడిన 9 ఫోన్లను అధికారులకు అందజేశారు. రెండు కవర్లలో పెట్టి ఉన్న ఫోన్లను స్వయంగా తీసుకెళ్లి అధికారులకు ఇచ్చారు. అంతకు ముందు ఆ ఫోన్లను మీడియాకు కూడా చూపించారు. కాగా, కవిత అందించిన ఫోన్లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, ఫోన్లు పరిశీలిస్తున్నందన కవిత కానీ, ఆమె తరపు ఇంకా ఎవరైనా ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు.

తాజాగా కవిత అడ్వొకేట్ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. లాయర్ భరత్ సమక్షంలోనే ఈడీ అధికారులు ఆమో ఫోన్లను చెక్ చేయబోతున్నారు. గతంలో ప్రతిపక్షాలు కవిత తన ఫోన్లను ధ్వంసం చేసిందంటూ ఆరోపణలు చేశారు. స్కామ్‌లో దొరక్కుండానే ఇలా ఫోన్లను నాశనం చేసిందని ఈడీ అధికారులు కూడా వ్యాఖ్యానించారు. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. కవిత తాను వాడిని ఫోన్లు అన్నింటినీ తీసుకెళ్లి ఈడీ అధికారులకు ఇచ్చారు. ఈ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అసలు తనకు స్కామ్‌కు సంబంధం లేదని కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు.

లిక్కర్ స్కామ్ దర్యాప్తు కేసులో అధికారి జోగేంద్రకు కవిత లేఖ రాశారు. తాను ఫోన్లను ధ్వసం చేశారని ఆరోపించడంపై ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈడీ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని, అందుకే నా ఫోన్లన్నీ సమర్పించానని లేఖలో పేర్కొన్నారు. అయినా ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అని కవిత ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ ఈడీ తాను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొందని లేఖలో పేర్కొన్నారు.

ఈడీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలను లీకులు ఇస్తోందని.. దీంతో ప్రజలు కూడా తనను నిందిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా.. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను కూడా ఇలాంటి వ్యాఖ్యలు దెబ్బతీస్తాయని ఆమె అన్నారు. వెంటనే ఫోన్లు పరిశీలించి, తనపై చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని కోరారు.

First Published:  29 March 2023 10:20 AM GMT
Next Story