Telugu Global
Telangana

మంత్రి గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి ఈడీ సోదాలు

గంగుల కమలాకర్ ఇంటి తాళాలను పగులగొట్టి మరీ అధికారులు లోనికి వెళ్లడం వివాదాస్పదమవుతోంది. కమలాకర్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనలో ఉన్నట్టు చెబుతున్నారు.

మంత్రి గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి ఈడీ సోదాలు
X


తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురిపెట్టింది. ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను, ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో సోదాలు నిర్వహించారు. గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్‌తో పాటు కరీంనగర్‌లోని మహవీర్, ఎస్వీఆర్‌ గ్రానైట్స్‌ కార్యాలయాల్లోనూ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గంగుల కమలాకర్ ఇంటి తాళాలను పగులగొట్టి మరీ అధికారులు లోనికి వెళ్లడం వివాదాస్పదమవుతోంది. కమలాకర్‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈడీ దాడుల విషయం తెలియగానే ఆయన తిరిగి వస్తున్నట్టు తెలుస్తోంది. గంగుల కమలాకర్ సోదరుల నివాసాల్లోనూ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

గంగులతో పాటు ఇతర గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు.

Next Story