Telugu Global
Telangana

పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో భూ ప్రకంపనలు... ఇళ్ళలోంచి బటికి పరుగులుతీసిన ప్రజలు

గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద, మాదిపాడు పంచాయితీలోని జడేపల్లి తండా, కంచిబోడు తండాల్లో భూకంపం వచ్చింది.

పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో భూ ప్రకంపనలు... ఇళ్ళలోంచి బటికి పరుగులుతీసిన ప్రజలు
X

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో, తెలంగాణలోని సూర్యాపేటజిల్లాలో భూకంపం వచ్చింది. ఈ రోజు ఉదయం 7.25 గంటలకు 10 సెకన్ల పాటు భూమి కంపించింది.

గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద, మాదిపాడు పంచాయితీలోని జడేపల్లి తండా, కంచిబోడు తండాల్లో భూకంపం వచ్చింది.

సూర్యాపేట జిల్లా కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో కూడా భూకంపం వచ్చింది. పెద్ద శబ్ధంతో రెండు సార్లు భూమి కంపించిందని స్థానికులు చెప్తున్నారు.

ఇదే ప్రాంతాల్లో గతంలోనూ పలుసార్లు భూకంపం వచ్చింది. మళ్ళీ ఈ రోజు భూమి కంపించడంతో ఇళ్ళల్లో ఉండడానికి ప్రజలు భయపడుతున్నారు.

Next Story