Telugu Global
Telangana

సవరాలు (వెంట్రుకలు) అమ్ముతూ ఏడాదికి రూ.27 కోట్ల సంపాదన..

జట్టు సంబంధిత సమస్యలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని.. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని 'వన్ హెయిర్ స్టాప్' సహ వ్యవస్థాపకురాలు రిచా తెలిపారు.

సవరాలు (వెంట్రుకలు) అమ్ముతూ ఏడాదికి రూ.27 కోట్ల సంపాదన..
X

సవరాలు (వెంట్రుకలు) అమ్ముతూ కోట్ల సంపాదిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథ ఇది. సవరాలు అమ్మితే అన్ని కోట్ల సంపాదించడం సులభమా అని ఆశ్చర్యపోకండి. ఆ అక్కాచెల్లెళ్లు రోడ్ల వెంట తిరుగుతూ అమ్ముకునే చిన్న వ్యాపారులు కాదు. సవరాల బిజినెస్‌ను కార్పొరేట్ స్థాయిలో చేస్తున వ్యాపారవేత్తలు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా హెయిర్ ఎక్స్‌టెన్షన్ (సవరాలు/వెంట్రుకలు)కు ఆదరణ ఎక్కువగా పెరుగుతోంది. మహిళలకు జట్టు రాలడం, పల్చబడటం అనే సమస్యలు ఎక్కువగా పెరిగాయి. ఇక ఫ్యాషన్ కోసం హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ను ఆశ్రయించే వాళ్లు కూడా ఎక్కువే. దీంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఈ వ్యాపారంలోకి ప్రవేశించి లాభాలు సంపాదిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన రిచా గ్రోవర్ బద్రుకా, రైనా గ్రోవర్ అనే ఇద్దరు సోదరీమణులు 2019లో 'వన్ హెయిర్ స్టాప్' అనే బ్రాండ్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ షో రూమ్ ప్రారంభించారు. మొదట్లో కేవలం 2 నుంచి మూడు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు రోజుకు 130 నుంచి 150 ఆర్డర్ల వరకు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది ఏకంగా రూ.27 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించినట్లు వారు పేర్కొన్నారు. జట్టు సంబంధిత సమస్యలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని.. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని 'వన్ హెయిర్ స్టాప్' సహ వ్యవస్థాపకురాలు రిచా తెలిపారు.

ఇండియా గ్లోబల్ హెయిర్ ఎగుమతిలో అగ్రగామిగా ఉన్నది. అయినా సరే మన మార్కెట్‌లో ఈ వ్యాపారానికి తగినంత గుర్తింపు రాలేదని అన్నారు. భారత్‌లో హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ మార్కెట్ పెరుగుదల కోసం ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం తమ ఆదాయంలో 75 శాతం దేశీయంగా.. 25 శాతం విదేశాల నుంచి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం తమకు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్‌లో కస్టమర్లు ఉన్నారని పేర్కొన్నారు.

వ్యాపారం ప్రారంభించిన నాటి నుంచి 1.2 లక్షలకు పైగా ఆర్డర్‌ల ద్వారా 2.1 లక్షలకు పైగా ఉత్పత్తులను విక్రయించామని అన్నారు. ప్రస్తుతం తమ అమ్మకాలు రూ.61 కోట్ల వరకు ఉన్నట్లు చెప్పారు. దీని ద్వారా రూ.27 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం వన్ హెయిర్ స్టాప్‌లో కలర్‌ఫుల్ స్ట్రీక్స్, మెస్సీ బన్స్, పోనీ టెయిల్స్, ఫ్లైఫిక్స్, సిల్క్ టాపర్‌లు ఉన్నట్లు రిచా పేర్కొన్నారు.

First Published:  24 Sep 2023 1:37 PM GMT
Next Story