Telugu Global
Telangana

ఇల్లీగల్ గా ఇ-సిగరెట్.. స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయిస్ లో క్రేజ్

పంజాగుట్టలోని ఓ బిజినెస్ స్కూల్​ లో చదువుకుంటున్న రాకేష్ కూడా కోల్ కతానుంచి ఇ-సిగరెట్లు తెప్పించి అమ్ముతున్నాడు. 71మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, స్టూడెంట్లకు సిగరెట్లు అమ్మాడని పోలీసులు తేల్చారు.

ఇల్లీగల్ గా ఇ-సిగరెట్.. స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయిస్ లో క్రేజ్
X

సిగరెట్ అలవాటు మాన్పించేందుకంటూ మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మరింత ప్రమాదకరం అని తేలడంతో దానిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆన్ లైన్ లో కూడా ఇ-సిగరెట్ అమ్మకాలు జరపకూడదని తేల్చి చెప్పింది. అయితే నిషేధించినవాటిపైనే యువతకు మోజు ఎక్కువ అయింది. ఇ-సిగరెట్ ఇల్లీగల్ బిజినెస్ హైదరాబాద్ లో జోరుగా సాగుతోంది.

విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇ-సిగరెట్ వ్యసానికి అలవాటు పడ్డట్టుగా తెలుస్తోంది. తాజాగా రాధా మాధవ్, రాకేష్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి వయసు 19 ఏళ్లు కాగా, మరొకరు 21ఏళ్ల వ్యక్తి కావడం విశేషం. వారి వద్దనుంచి 3లక్షల రూపాయల విలువైన ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వినియోగదారులే దళారులు..

ముందుగా విద్యార్థులు వీటికి బానిసలవుతున్నారు, ఆ తర్వాత వారే డబ్బుకోసం దళారులుగా అవతారమెత్తుతున్నారు. శంకర్ పల్లిలోని ఐబీఎస్ కాలేజీలో చదువుతున్న రాధా మాధవ్ ముందుగా వీటిని ఆన్ లైన్ లో కొన్నాడు. ఆ తర్వాత వాటిని స్థానికంగా అమ్మడం మొదలు పెట్టాడు. డిమాండ్ ఎక్కువ కావడం, సీక్రెట్ గా వ్యాపారం జరిగిపోతుండటంతో జోరుగా అమ్మకాలు సాగించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. సిటీలోని కాలేజీ స్టూడెంట్స్ కు, ఐటీ ఎంప్లాయిస్ కి వీటిని అమ్మేవాడు మాధవ్.

పంజాగుట్టలోని ఓ బిజినెస్ స్కూల్​ లో చదువుకుంటున్న రాకేష్ కూడా కోల్ కతానుంచి ఇ-సిగరెట్లు తెప్పించి అమ్ముతున్నాడు. 71మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, స్టూడెంట్లకు సిగరెట్లు అమ్మాడని పోలీసులు తేల్చారు. నిందితులిద్దర్ని రిమాండ్​ కు తరలించారు. దీప్​, యష్, తేజ్ అనే ముగ్గురు యువకులు పరారీలో ఉన్నట్టు తెలిపారు.

First Published:  8 Sep 2023 4:13 AM GMT
Next Story