Telugu Global
Telangana

తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు

గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసింది రేవంత్ సర్కార్. ఆ పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులు చేర్చి కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.

తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు
X

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. లక్షలాది మంది ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 11,062 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2024 విడుదల చేశారు.

మొత్తం పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629 పోస్టులు, భాషా పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, ఎస్జీటీలు 6,508 పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.


గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసింది రేవంత్ సర్కార్. ఆ పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులు చేర్చి కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. గతంలో అప్లయ్ చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

First Published:  29 Feb 2024 6:48 AM GMT
Next Story