Telugu Global
Telangana

5 రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల సొత్తు సీజ్.. తెలంగాణే టాప్

ఐదు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నగదు, లిక్కర్, డ్రగ్స్‌ ఇతర వస్తువులు పట్టుబడ్డాయని తెలిపింది. 2018లో ఈ రాష్ట్రాల్లో రూ.239 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోగా.. ఈ సారి అది 7 శాతం పెరిగింది.

5 రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల సొత్తు సీజ్.. తెలంగాణే టాప్
X

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన నగదు, మద్యం, విలువైన అభరణాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 9న షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఐదు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నగదు, లిక్కర్, డ్రగ్స్‌ ఇతర వస్తువులు పట్టుబడ్డాయని తెలిపింది. 2018లో ఈ రాష్ట్రాల్లో రూ.239 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోగా... ఈ సారి అది 7 శాతం పెరిగింది.

అత్యధికంగా తెలంగాణలో రూ.225 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రూ.86 కోట్ల విలువైన మద్యం, రూ.1.3 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.191 కోట్ల విలువైన వస్తువులతో పాటు రూ.52 కోట్ల విలువైన గిఫ్టులు, ఉచితాలను అధికారులు సీజ్ చేశారు. మొత్తంగా తెలంగాణలో ఇప్పటివరకూ రూ.659 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ నిలిచింది. ఈ రాష్ట్రంలో రూ.93 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.650 కోట్ల విలువైన సొత్తును అధికారులు సీజ్ చేశారు. ఇక మధ్యప్రదేశ్‌, ఛ‌త్తీస్‌గఢ్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మధ్యప్రదేశ్‌లో రూ.33 కోట్ల నగదు, ఛ‌త్తీస్‌గఢ్‌లో రూ.20 కోట్ల నగదు సీజ్ చేయగా.. మిజోరాంలో ఎలాంటి నగదు పట్టబడలేదు.

ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో ఎలక్షన్లు ముగియగా రాజస్థాన్‌లో నవంబర్ 25, తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎలక్షన్‌ కమిషన్ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ -ESMSను ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 228 మంది అధికారులను వ్యయ పరిశీలకులను నియమించింది.

First Published:  21 Nov 2023 2:22 AM GMT
Next Story