Telugu Global
Telangana

మందుబాబులకు షాక్.. 5819 డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు

మందుబాబులకు షాక్.. 5819 డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు
X

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మందుబాబులు రెచ్చిపోయారు. మందుబాబులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారనడానికి న్యూ ఇయర్ సందర్భంగా జరిగిన మద్యం అమ్మకాలే సాక్ష్యం. అయితే అదే సమయంలో మందుబాబులకు పెద్ద షాక్ కూడా తగిలింది. ఎంజాయ్ మెంట్ సంగతి ఎలా ఉన్నా.. డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దయ్యాయి. మందు తాగి వాహనాలు నడిపిన వారిలో 5819 మందికి డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేసింది రవాణా శాఖ.

శనివారం హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. చాలా చోట్ల మందుబాబులు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపింది రవాణా శాఖ. మొత్తం 5819 మంది వాహనాదారులు లైసెన్సులను రద్దు చేసింది. మద్యం తాగి వాహనం నడిపిన కారణంగా వారందరి లైసెన్సులు రద్దు చేసింది.

నార్త్ జోన్ లో 1103, సౌత్ జోన్ లో 1151, ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1345 మంది లైసెన్సులు రద్దయ్యాయి. మిగతా ప్రాంతాల్లో మరికొంతమంది లైసెన్స్ లు క్యాన్సిల్ చేశారు. 2021లో కూడా ఇలాగే లైసెన్స్ లను రద్దు చేశారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య భారీగా పెరిగింది. 2022కి స్వాగతం పలికే సందర్భంలో కూడా తెలంగాణలో మందుబాబులకు పెద్ద షాక్ తగిలింది. ఏడాది క్రితం 3,220 వాహనదారుల లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఏడాది మొత్తం 5819 మంది డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దయ్యాయి. హైదారాబాద్ ట్రాఫిక్ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సంజీవరెడ్డి నగర్ లో 73, పంజాగుట్టలో 51, బంజారా హిల్స్ లో 48, జూబ్లీ హిల్స్ లో 49 కేసులు నమోదు చేశారు.

First Published:  1 Jan 2023 2:02 PM GMT
Next Story