Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో డజన్‌ మంది ముఖ్యమంత్రులు.. కేసీఆర్ సెటైర్లు

కాంగ్రెస్‌లో సీఎం నేనైతా అని ఒకరంటే.. నువ్వేలా సీఎం అవుతావని మరొకరంటారన్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కడూ నన్ను గెలిపించండి.. సీఎం అవుతానంటూ ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌లో డజన్‌ మంది ముఖ్యమంత్రులు.. కేసీఆర్ సెటైర్లు
X

కాంగ్రెస్‌లో సీఎం పదవి గోలపై ఫస్ట్ టైమ్‌ స్పందించారు సీఎం కేసీఆర్. ఎన్నిక‌ల‌ ప్రచారంలో భాగంగా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ టార్గెట్‌గా సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్‌లో డజన్‌ మంది ముఖ్యమంత్రులున్నారని, వీధికో ముఖ్యమంత్రి ఉన్నారంటూ పంచులు వేశారు.

కాంగ్రెస్‌లో సీఎం నేనైతా అని ఒకరంటే.. నువ్వేలా సీఎం అవుతావని మరొకరంటారన్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కడూ నన్ను గెలిపించండి.. సీఎం అవుతానంటూ ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. కానీ, కాంగ్రెస్‌ గెలిచే పరిస్థితి లేదన్నారు సీఎం కేసీఆర్‌. దేశమంతా ఏం జరుగుతోందనేది మీరు కూడా చూస్తున్నారంటూ అక్కడున్న ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ నేతలు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.


ఇటీవల పలువురు నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామే సీఎం అవుతామంటూ ప్రచారం చేసుకున్నారు. కొడుకు తరపున ప్రచారం చేస్తున్న సీనియర్ లీడర్ జానారెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయంటూ కామెంట్స్ చేశారు. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సైతం తామే సీఎం రేసులో ఉన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారన్న రూమర్స్ ఉన్నాయి.

First Published:  31 Oct 2023 10:58 AM GMT
Next Story