Telugu Global
Telangana

డాక్టర్ వైశాలి కిడ్నాపర్ నవీన్ రెడ్డి గోవాలో అరెస్ట్!

ఈ నెల 9న న‌వీన్ రెడ్డి, అత‌ని స్నేహితులు వైశాలి ఇంటిపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. వైశాలి తండ్రి, ఇతర బంధువులపై దాడి చేసి గాయపర్చారు. అయితే తమ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న కిడ్నాపర్లు వైశాలిని వదిలేసి పరారయ్యారు. వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్ప‌టికే 32 మందిని అరెస్ట్ చేశారు. 9వ తేదీ నుంచి న‌వీన్ ప‌రారీలో ఉన్నాడు.

డాక్టర్ వైశాలి కిడ్నాపర్ నవీన్ రెడ్డి గోవాలో అరెస్ట్!
X

ఆదిబట్లలో డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డిని రాచకొంద పోలీసులుకొద్ది సేపటి క్రితం గోవాలో అరెస్టు చేశారు. గోవా కాండోలిమ్ బీచ్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతన్నిపోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు.

ఈ నెల 9న న‌వీన్ రెడ్డి, అత‌ని స్నేహితులు వైశాలి ఇంటిపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. వైశాలి తండ్రి, ఇతర బంధువులపై దాడి చేసి గాయపర్చారు. అయితే తమ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న కిడ్నాపర్లు వైశాలిని వదిలేసి పరారయ్యారు. వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్ప‌టికే 32 మందిని అరెస్ట్ చేశారు. 9వ తేదీ నుంచి న‌వీన్ ప‌రారీలో ఉన్నాడు.

మరో వైపు పోలీసులు ఈరోజు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే 32 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏ3 భానుప్రకాష్, ఏ4 సాయినాథ్, ఏ8 ప్రసాద్, ఏ9 హరి, ఏ30 విశ్వేశ్వర్ లను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. వారం రోజుల ముందే వైశాలిని కిడ్నాప్ చేయాలని నవీన్ రెడ్డి ప్లాన్ చేశారని కస్టడీ పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కిడ్నాప్‌లో నవీన్ రెడ్డితో పాటు రుమాన్, చందు, సిద్దు, సాయినాథ్, భానుప్రకాష్ కీలక పాత్రధారులు. నిశ్చితార్థం సందర్భంగా ఆమెను కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నారు. వైశాలితో పాటు చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురిచేయాలని ప్లాన్ చేశారు. 40 మందితో కలిసి కిడ్నాప్‌కు ప్లాన్‌ చేశారు. సినిమాలో లాగా.. పట్టుబడితే తప్పించుకునేందుకు నవీన్ రెడ్డి అప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.

అయితే.. గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో నవీన్ రెడ్డిని వైశాలి కలిశారు. ఈ క్రమంలో నవీన్ రెడ్డి వైశాలి మొబైల్ నంబర్ తీసుకుని తరచూ ఫోన్లు, మెసేజ్ లు చేశాడు. పరిచయాన్ని అలుసుగా తీసుకొని వైశాలితో ఫొటోలు దిగాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. నవీన్ ప్రతిపాదనపై స్పందించిన వైశాలి తన తల్లిదండ్రులు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే.. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నించాడు. కానీ వారుపెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న నవీన్ రెడ్డి.. వైశాలి పేరుతో ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి వారిద్దరి ఫొటోలను వైరల్ చేశాడు. ఐదు నెలల క్రితం వైశాలి ఇంటి ముందు ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకుని తాత్కాలికంగా షెడ్డు వేశారు. అక్కడ ఆగస్టు 31న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి నిమజ్జనం సందర్భంగా బీభత్సం సృష్టించాడు. వైశాలి ఫిర్యాదు మేరకు ఆదిబట్ల పోలీసులు నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో, వైశాలి తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 9వ తేదీన వైశాలి నిశ్చితార్థం జరుగుతోందని నవీన్ రెడ్డికి తెలిసింది. దీంతో వైశాలిని అపహరించి పెళ్లికి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం తన అనుచరులతో పాటు తన టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని కూడా ఉపయోగించుకున్నాడు. 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీసీఎంలోని వైశాలి ఇంటికి వచ్చిన నవీన్ రెడ్డి అనుచరులు ఇంటి ముందు పార్క్ చేసిన 5 కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. వైశాలి ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి సీసీ కెమెరాల డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. వైశాలిని వోల్వో కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. నవీన్ రెడ్డి, అతని సహచరులు ముందుగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దారిలో నవీన్ రెడ్డి స్నేహితుడు రుమాన్ ఫోన్ ఆన్ చేశాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని నవీన్ రెడ్డికి చెప్పి.. వైశాలిని వదిలేయమన్నాడు.

దాంతో నల్గొండ దగ్గర నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు కారు దిగారు. అదే కారులో వైశాలిని తీసుకొచ్చిన రుమాన్ ఆమెను మన్నెగూడలో వదిలేశాడు. 9వ తేదీ సాయంత్రం 6.35 గంటలకు వైశాలి బాగానే ఉందని తండ్రికి ఫోన్ చేసింది. రాత్రి 8.37 గంటలకు అక్కడికి వెళ్లి పోలీసులు, కుటుంబ సభ్యులతో కలిసి వైశాలిని ఇంటికి తీసుకొచ్చారు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇప్పటికే 32 మందిని అరెస్ట్ చేశారు. నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు కస్టడీ పిటిషన్‌లో సవివరంగా పేర్లొన్నారు పోలీసులు.

First Published:  13 Dec 2022 4:03 PM GMT
Next Story