Telugu Global
Telangana

మీరు రీల్స్ చేస్తారా? తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కాంటెస్ట్‌లో పాల్గొని రూ.75వేలు గెలుచుకోండి

మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.30,000 నగదు బహుమతి అందిస్తారు.

మీరు రీల్స్ చేస్తారా? తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కాంటెస్ట్‌లో పాల్గొని రూ.75వేలు గెలుచుకోండి
X

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక ఏ సమాచారాన్ని అయినా వేగంగా వేలాది మందికి తెలియజేయడానికి చాలా ఉపయోగపడుతోంది. ఇటీవల కాలంలో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా సినిమా పబ్లిసిటీ, ప్రభుత్వ పథకాల ప్రచారం, టాలెంట్ ప్రదర్శనకు సోషల్ మీడియా మంచి వేదికగా నిలుస్తోంది. ఈ మధ్య 'రీల్స్' చాలా పాపులర్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడే చేసే ఈ షార్ట్ వీడియోల ద్వారా ఓవర్ నైట్ పాపులర్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. షార్ట్ వీడియోల ద్వారా విషయాన్ని కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే అర్థం అయ్యేలా వివరించవచ్చు. అందుకే చాలా మంది ఈ రీల్స్‌ను తమ ఉత్పత్తుల ప్రచారానికి, టాలెంట్ ప్రదర్శనకు ఉపయోగిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రీల్స్‌ను ఉపయోగించుకొని ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రీల్స్, సాంగ్ రైటింగ్, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ నిర్వహించనున్నది. ఇటీవల కాలంలో యువత డ్రగ్స్‌కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ సమాజంపై ఎన్నో దుష్ఫ్రభావాలను చూపిస్తోంది. దీనిపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర స్థాయి షార్ట్ వీడియో కాంటెస్ట్ (రీల్స్) నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ఎంపర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్.. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (తెలంగాణ పోలీస్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు.

'డ్రగ్స్, సమాజంపై దాని ప్రతికూల ప్రభావం' అనే అంశంపై మూడు నిమిషాల వీడియోను రూపొందించాల్సి ఉంటుంది. డ్రగ్స్ కారణంగా సమాజంపై చూపిస్తున్న దుష్ప్రభావాలతో పాటు కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు ఈ వీడియోలో చూపించాలి. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఎవరైనా ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఈ వీడియోలను జూన్ 20లోపు పంపించాలని నిర్వాహకులు కోరారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.30,000 నగదు బహుమతి అందిస్తారు.


లిరిక్ రైటింగ్, పోయెమ్ రైటింగ్..

రీల్స్‌తో పాటు అదే సబ్జెక్ట్‌పై పాట, పద్యం రచనల కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆసక్తి కలిగిన రచయితలు జూన్ 15లోగా తమ రచనలు పంపించాలి. మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.7,000, మూడో బహుమతి రూ.5,000 అందజేయనున్నారు.


పోస్టర్ మేకింగ్..

డ్రగ్స్, వాటి వాడకం వల్ల కలిగే దుష్ఫ్రభావాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పోస్టర్ల కాంపిటీషన్ కూడా నిర్వహిస్తున్నారు. 15 ఏళ్ల కంటే పై బడిన వాళ్లు ఈ పోటీలో పాల్గొనవచ్చు. జూన్ 15లోగా తమ పోస్టర్లను పంపించాల్సి ఉంటుంది. మొదటి బహుమతి రూ.5,000, రెండో బహుమతి రూ.3,000, మూడో బహుమతి రూ.2,000 అందజేయనున్నారు.

పై మూడు కాంపిటీషన్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు 9652394751 నెంబర్‌కు కాల్ చేయాలని లేదా https://wdsc.telangana.gov.in/index.phpలో సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు.



First Published:  28 May 2023 2:08 PM GMT
Next Story