Telugu Global
Telangana

నిర్ణయం అధిష్టానానిదే.. - డీకే శివకుమార్‌

కేసీఆర్, కేటీఆర్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని ఆయన చెప్పారు.

నిర్ణయం అధిష్టానానిదే.. - డీకే శివకుమార్‌
X

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు లాంఛనమే అన్న విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్‌ తీరు దానిని తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కి చాలా దూరంగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని స్పష్టమైందని చెప్పారు. తదుపరి కార్యాచరణపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే సమాధానం ఇచ్చేశారని.. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక వాళ్లు పెట్టిన ట్వీట్లకు తాము సమాధానం ఇస్తామని ఆయన తెలిపారు.

రేసులో ఉన్నానా.. లేదా.. అన్నదా అప్రస్తుతం : కోమటిరెడ్డి

మరోవైపు కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్‌ డే గిఫ్ట్‌గా ఇస్తున్నామన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానా..? లేదా..? అన్నది అప్రస్తుతమని తెలిపారు. కాంగ్రెస్‌ గెలుపు బాటలో సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ రేవంత్‌రెడ్డిని కలవడంపై ఆయన స్పందిస్తూ.. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాబట్టే డీజీపీ వెళ్లి కలిశారని చెప్పారు.

First Published:  3 Dec 2023 9:45 AM GMT
Next Story